ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cyclone_Michaung_Effect_Crop_Loss

ETV Bharat / videos

నట్టేట ముంచిన తుపాను - తీవ్రంగా దెబ్బతిన్న పంటను చూసి రైతుల కన్నీరు - తుపాను వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌లో పంటలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 5:02 PM IST

Cyclone Michaung Effect Crop Loss: మిగ్‌జాం తుపాను రైతులను నట్టేట ముంచింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో ఉన్న మేడవాగు బలుసుపాడు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. మిగ్‌జాం తుపాను చేతికి వచ్చిన పంటను నీటిపాలు చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు మేడవాగు ఉద్ధృతంగా ప్రవహించి పొలాలను వరద ముంచెత్తింది. రేయింబవళ్లు కష్టపడి పండించిన వరి, మినుము, శనగ పంటలు నీటమునిగాయి. 

పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామంలో వందలాది ఎకరాల్లో పంట వరదపాలయిందని రైతులు వాపోతున్నారు. వరి, మినుము, శనగ, తదితర పంటలు పూర్తిగా నీట మునిగాయని కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల్లో మరోసారి విత్తనాలు కూడా తీసుకొచ్చే స్తోమత లేదని ఆవేదన చెందుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టామని కానీ వరద కారణంగా పంట చేతికొచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. పంటలు మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details