ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వామ్మో మెుసలి - భయంతో వణికిపోతున్న జనం! ఎక్కడంటే?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 3:39 PM IST

People_Suffering_From_Crocodile_in_Konaseema_District

Crocodile on Road in Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లా సమనస గ్రామం వద్ద నీటిలో సంచరిస్తున్న మెుసలి ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. రెండు నెలల క్రితం ఆత్రేయపురం వద్ద ఉన్న అమలాపురం ప్రధాన పంట కాలువలోకి మెుసలి ప్రవేశించింది. అప్పట్లో స్థానికులు దానిని గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. తరువాత కనిపించకుండా పోయిన మెుసలి అదే కాలువలో సంచరిస్తూ.. 20 రోజులు క్రితం అమలాపురం వద్ద మళ్లీ కనిపించింది. భయందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు మెుసలిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేసినా.. దానిని పట్టుకోలేక పోయారు. 

తాజాగా అదే మెుసలి ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సమనస గ్రామం వద్ద ఉన్న పంట కాలువలోంచి ప్రధాన రహదారిపైకి వచ్చింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు దానిని గుర్తించి లైట్లు వేయడంతో అది మళ్లీ కాలువలోకి వెళ్లిపోయింది. మెుసలిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన రహదారులపైన, కాలువలో మెుసలి సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న మెుసలిని పట్టుకొని తమ.. భయాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details