ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CREDAI Property Show

ETV Bharat / videos

విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షో - 'స్థిరాస్తిపై ప్రతి రూపాయికీ భరోసా' - ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 5:50 PM IST

 CREDAI Property Show begins in Vizag:విశాఖనగరంలో క్రెడాయ్ నిర్వహిస్తోన్న తొమ్మిదవ ప్రాపర్టీ షో ఆరంభమైంది. వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖ పరిసరాల్లో స్ధిరాస్ధి కొనుగోలు ద్వారా తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇది మంచి అవకాశమని క్రెడాయ్ విశాఖ వర్గాలు వివరించాయి. ఈ ప్రాపర్టీ షోను విశాఖ పట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్ గొలగాని వెంకట హరి కుమారి లు ప్రారంభించారు. స్ధిరాస్ధి రంగంలో కొనుగోళ్లు మందగించడానికి పలు కారణాలు ఉన్నప్పటికి వాటిని అధిగమించి వినియోగదార్లు ఈ షోలో పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తారని అందుకు అనుగుణంగా పలు అఫర్లను అందిస్తున్నారని క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. 

స్ధిరాస్ధి విలువ ఏటా పెరుగుతున్నాయని, దీనిపై పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయి ఎప్పటికి రక్షణగానే ఉంటుందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. వినియోగదార్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవిధంగా పలు బ్యాంకులు ఇందులో తమ గృహరుణాలు ఇతర రాయితీలను అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో స్ధిరాస్ది రంగం ఎప్పుడూ వృద్ది చెందుతూనే ఉందని ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. నగరం విస్తరిస్తూనే ఉందని దానివల్ల నివాసాల అవసరం ఎప్పుడూ పెరుగుతూనే ఉందని మేయర్ హరి వెంకట కుమారి అన్నారు. ఈ ప్రాపర్టీ షో మూడు రోజుల పాటు 25 తేదీ వరకు కొనసాగనుంది. 

ABOUT THE AUTHOR

...view details