ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దంపతులు ఆత్మహత్యాయత్నం

ETV Bharat / videos

Couple Suicide Attempt: పొరుగింటి వారితో గొడవ.. దంపతులు ఏం చేశారంటే..! - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్

By

Published : Jul 23, 2023, 9:34 AM IST

Couple Suicide Attempt: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నెరమెట్లలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని కనకవీడు గ్రామానికి చెందిన నరసింహులు నెరమెట్ల గ్రామంలో 12 సంవత్సరాలుగా ఆర్​ఎంపీ డాక్టర్​గా పని చేస్తున్నాడు. తన భార్య ద్రాక్షవేణి, ముగ్గురు పిల్లలతో కలసి అదే గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే పొరుగింటివారు తరచూ లేనిపోని కారణాలతో గొడవ పడటమేకాక కొన్ని సందర్భల్లో అకారణంగా దాడి చేశారని బాధితులు వాపోయారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా రెండిళ్ల మధ్య గొడవ జరిగింది. తమపై తరచూ దాడి చేస్తున్నా పట్టించుకునే వారు లేరని మనోవేదనకు గురైన ఆ దంపతులు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న కొందరు గమనించి వారిని చికిత్స కోసం ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ 108 వాహనంలో అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉరవకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details