జనసేనలో చేరిన ఉమ్మడి కృష్ణా జిల్లా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలు - YCP Joining in janasena
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 1:37 PM IST
Congress and YSRCP Leaders Joining in Janasena Party :ప్రజలు ఊహించే మార్పును జనసేన కచ్చితంగా తీసుకొస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నేతలను సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర మాజీ అధ్యక్షులు బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్లు చిలక సలోమి భగవాన్, సముద్రాల ప్రసాద్, అవనిగడ్డ చెందిన వైఎస్సార్సీపీ నాయకులు రామాంజనేయులు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన నేతల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇటీవలే పార్టీలో చేరినవైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్ను విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
Invitation to Pawan Kalyan to Come Opening Ceremony of Sri Rama Mandir in Ayodhya :విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులు పవన్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి రావాలని జనసేనానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్ళపూడి జగన్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞలు అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలను తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ 30 లక్షలు విరాళాన్ని అందజేశారు.