ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్ విశాఖ పర్యటన

ETV Bharat / videos

CM Jagan Visakha Tour: విశాఖతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్ - CM Jagan

By

Published : Aug 1, 2023, 7:48 PM IST

CM Jagan lays inorbit mall foundation stone in Visakha: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో ఇనార్బిట్‌ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. విశాఖలో మరో ఆణిముత్యంలా నిలిచిపోయే ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ మాల్​ను 600 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారని తెలిపారు. మొత్తం 17 ఎకరాల స్థలంలో.. కేవలం మాల్ నిర్మాణం 12-13 ఎకరాలలో నిర్మించడం చాలా తక్కువ ప్రదేశాలలో మాత్రమే జరుగుతుందని అన్నారు. విశాఖ మహానగరంతో పాటు ఉత్తరాంధ్ర రూపు రేఖలు మార్చేలా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో.. నీల్ రహేజా సహా ఇనార్బిట్ మాల్ ప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇది దక్షిణాదిలోనే అతిపెద్ద మాల్ అవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్ ద్వారా త్వరలో 8 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్​ తెలిపారు. ఎలాంటి సహాయ సహకారాలైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అవసరమైతే ఫోన్ చేయాలని.. నీల్ రహేజాకు జగన్ సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details