ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM JAGAN

ETV Bharat / videos

CM JAGAN RELEASED FUNDS: పేద విద్యార్థులు భవిష్యత్​లో ఉన్నత స్థానానికి ఎదగడమే లక్ష్యం: సీఎం జగన్​ - Jagananna foreign education scheme news

By

Published : Jul 27, 2023, 4:09 PM IST

Jagananna foreign education scheme funds release: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 357 మంది విద్యార్థులకు 45 కోట్ల రూపాయలను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్న జగన్.. విదేశాల్లోని అత్యుత్తుమ విద్యాసంస్థల్లో చదువుకోవాలన్నారు. మన రాష్ట్ర విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతోనే ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

దేశంలో ఎక్కడా ఇలాంటి మార్పులు లేవు..''విద్యా వ్యవస్థలో ఇదొక విప్లవాత్మక మార్పు. దేశంలో ఇలాంటి మార్పులు ఏ రాష్ట్రంలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయంతో.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులంతా ఉన్నత స్థానాలకు చేరుకుని, రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచాలి. పేద విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యంతోనే.. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఈ 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈరోజు అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్ల నిధులను విడుదల చేశాం. ఈ నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ పథకం విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. గతంలో రూ.6 లక్షలు ఉన్న ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచి అర్హత ఉన్న వారందరికీ సాయం చేస్తున్నాం. ఈ విధంగా సాయం చేస్తోన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు.'' అని సీఎం జగన్ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details