ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Clashes Between YSRCP Two Groups In Anakapalli

ETV Bharat / videos

నక్కపల్లిలో వైసీపీ వర్గాల బాహాబాహీ.. ఎమ్మెల్యే సమక్షంలోనే..! - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

By

Published : Apr 5, 2023, 12:41 PM IST

Clashes Between YSRCP Two Groups In Anakapalli : అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈ సంఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో.. వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని.. నక్కపల్లిలో సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బాబురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే బాబురావు వర్గానికి, ఆయన వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చూస్తుండగానే.. ఇరు వర్గాలు ఎమ్మెల్యే బాబురావు సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. పోలీసులు, ఇతర నాయకులు ఎమ్మెల్యేను సురక్షితంగా సభా వేదిక నుంచి బయటికి తీసుకుని వచ్చారు. ఇతరులు కలగుజేసుకుని అడ్డుకోవడంతో.. బాహాబాహీకి దిగిన రెండు వర్గాలు శాంతించాయి. వివాదం అనంతరం..వైసీపీ MLA బాబురావు వ్యతిరేక వర్గీయులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రహదారిని దిగ్బంధించారు. దాంతో కొద్దిసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. 

ABOUT THE AUTHOR

...view details