ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu_Delhi_Tour

ETV Bharat / videos

Chandrababu Delhi Tour Schedule: దిల్లీకి చంద్రబాబు.. రెండు రోజులు అక్కడే.. - సీబీఎన్ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 12:40 PM IST

Chandrababu Delhi Tour Schedule: రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు..(CBN Complaint to CEC about Illegal Votes) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ నుంచి దిల్లీకి వెళ్లనున్నారు. ఓట్ల తొలగింపులో ఊరూరా ఉరవకొండ లాంటి ఘటనలు ఉన్నాయని.. 28వ తేదీన  సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే సోమవారం ఎన్టీఆర్ చిత్రపటంతో ప్రత్యేక 100 రూపాయల నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (NTR 100 Rupees Coin Release on August 28) విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ వేడుకలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఓట్ల అక్రమాలపై సీఈసీని కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం టీడీపీ అనుకూల ఓట్ల సమాచారం సేకరించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను సీఈసీకి అందజేస్తారు. ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వచ్చిన సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి సీఈసీకి టీడీపీ సమర్పించనుంది. అక్రమాలు నివారించటంతో పాటు బాధ్యులైన ప్రతీ అధికారిపై ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని సీఈసీని చంద్రబాబు కోరనున్నారు.

ABOUT THE AUTHOR

...view details