Buggana Reviewed Development in Kurnool District : అనుమతులు వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు : బుగ్గన - buggana rajendranath talk about kurnool high court
Buggana Reviewed Development in Kurnool District :కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుమతులు వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం.. అదేవిధంగా జగన్నాథ్ గట్టు పై న్యాయ విశ్వవిద్యాలయానికి త్వరలోనే ముఖ్య మంత్రి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మిగనూరు, మంత్రాలయ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని తెలిపారు. అదేవిధంగా కలెక్టరేట్ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8.08 కోట్లు మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు చేసేందుకు శంకుస్థాపన చేశారు. పనులు నాణ్యతగా, ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. జి.సృజనకు మంత్రి సూచించారు. ఈ సమవేశంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖన్, డీఆర్వో నాగేశ్వరరావు పాల్లొన్నారు.