TDP Buddha Venkanna Fire on Undalli Arun Kumar : ఉండవల్లిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోంది : టీడీపీ నేత బుద్ధా వెంకన్న
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2023, 5:01 PM IST
TDP Buddha Venkanna Fire on Undalli Arun Kumar రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న(Venkanna) విమర్శించారు. ఉండవల్లికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముడుపులు ముట్టాయని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీచేస్తు్ండడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి చేయకపోయినా అవినీతి బురద జల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎవరినీ వదిలే ప్రసక్తే ఉండదని బుద్ధా హెచ్చరించారు.
నిన్నా మొన్నటి దాకా జగన్ రెడ్డిని విమర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ అకస్మాత్తుగా రూటు మార్చకోవడం వెనుక తాడేపల్లి నుంచి భారీగా ముడుపులు అందాయి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో ఉండవల్లి ఘనుడు. అరుణ్ కుమార్ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కానీ, ఇక్కడ మాత్రం సాదాసీదా వ్యక్తిలా కనిపిస్తాడు. చంద్రబాబు నాయుడుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా కల్పితం.