జగన్ మోసం చేశారు- బొండా ఉమా - బోండా ఉమా తాజా వ్యాఖ్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 12:03 PM IST
Bonda Uma Fires On Jagan: సీఎం వైఎస్ జగన్ యువతను మోసం చేసారంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉద్యోగ కల్పన చేస్తానని కలబొల్లి మాటలు చెప్పిన జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని బొండా విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంపై యువత తీవ్ర నిరుత్సాహంతో ఉందన్నారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఉమా హెచ్చరించారు. నియోజకవర్గాల్లో రాజకీయ బదిలీలు చేసిన పార్టీలు ప్రపంచంలోనే మరెక్కడా ఉండవని, ఈ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెల్లుతుందని విమర్శించారు. పక్క నియోజకవర్గంలో చెల్లని కాసు మరో నియోజకవర్గంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. తమపై పోటీకి ఎవరొచ్చినా తాను సిద్ధంగా ఉన్నాని బొండా ఉమా స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అవినీతిపై నియోజవర్గ ప్రజలలో అవగాహన కల్పించి వారిని తరిమి కొడతానికి సిద్ధంగా ఉండాలని బొండా మహేశ్వరావు స్పష్టం చేశారు.