లేని తమిళనాడు వలస కూలీలకు ఓట్లు - ఫిర్యాదు చేసినా పట్టించుకోని బీఎల్వోలు - Draft Voters List Special Drive In AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 7:36 PM IST
BLOs Ignore Complaints About Fake Votes:గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో దొంగ ఓట్లు తొలగించాలని బీఎల్వోలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీరో ఇంటి నంబరు, గ్రామాలు, వ్యక్తుల పేర్లు అన్ని రెండు సార్లు నమోదు చేశారని చెబుతున్నారు. చనిపోయిన వారిని కూడా ఇంకా ఓట్ల జాబితాలో నుంచి తొలగించ లేదని వాపోతున్నారు. జీరో డోర్ నెంబర్‌తో 19 ఓట్లు ఉండగా అందులో చనిపోయిన వారు 15 మంది ఉన్నారు. కానీ ఆ జాబితాల్లో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయలేదని గ్రామస్థులు అంటున్నారు.
తమిళనాడు నుంచి వలస కూలీలుగా వచ్చి గ్రామంలోనే కూలి పని చేసుకుని జీవనం సాగించేవారు. కానీ ఇప్పడు వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వారికి కూడా ఇక్కడే ఓటు ఉందని వాటన్నింటిని తొలగించమని అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.