ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Ramesh

ETV Bharat / videos

JP Nadda AP Tour ఏపీలో ఈ నెల 10న జేపీ నడ్డా, 11న అమిత్ షా పర్యటన.. - CM Ramesh fire on CM Jagan

By

Published : Jun 8, 2023, 11:01 PM IST

BJP MP CM Ramesh fire on AP CM Jagan: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి.. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన, 11వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పార్టీ  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‍ కీలక విషయాలను వెల్లడించారు. జాన్ 11వ తేదీన విశాఖపట్టణం జిల్లాలో జరగనున్న సభలో కేంద్ర హూంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారని.. సీఎం రమేష్‍ తెలిపారు. ఈ నెల 10వ తేదీన శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‍ మాట్లాడుతూ..''అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్రంలో పుట్టిన ప్రతిబిడ్డపై రెండు లక్షల అప్పు తెచ్చి పెట్టిన ఘనుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. తొమ్మిది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్దిపై ఈ నెల 10న శ్రీకాళహస్తిలో సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విచ్చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన విశాఖలో జరగనున్న సభలో కేంద్ర హూంమంత్రి అమిత్ షా పాల్గొంటారు.'' అని ఆయన అన్నారు.

అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రతి పథకం వెనకాల అవినీతి ఉందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‍ ఉద్యోగులను తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్.. ఆనాడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను మోసం చేసిన ఘనత జగన్‍‌కే దక్కిందని దుయ్యబట్టారు.

మరోవైపు ఎల్లుండి రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. రేపు సాయంత్రం ఆయన దిల్లీ నుంచి తిరుపతి చేరుకోనున్న జేపీ నడ్డా.. రేపు రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. అనంతరం 10వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకోని..తిరుచానూరులో కార్యకర్తల భేటీలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details