ఆంధ్రప్రదేశ్

andhra pradesh

sunitha

ETV Bharat / videos

అంగన్​వాడీల ఆందోళనపై సీఎం జగన్​ ఎందుకు స్పందించడం లేదు?: ఆచంట సునీత - ntr district news update

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 10:33 PM IST

Achanta Sunitha on Anganwadi Strike :రాష్ట్రంలో అంగన్​వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు సమ్మె సైరన్​ మోగించినా ప్రభుత్వం వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర డ్వాక్రా సాధికార విభాగాల అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. రాష్ట్రంలో అంగన్​వాడీ కార్యకర్తలు 16 రోజులుగా సమ్మె చేస్తున్నా అధికార పార్టీ నేతలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్​ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వారి కంటే ఎక్కువ వేతనం చెల్లిస్తామని వారిని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.

Government Negligence : అధికార నేతలు అంగన్​వాడీ కార్యకర్తలతో నామమాత్రంగా చర్చలు జరిపారని సునీత వ్యాఖ్యానించారు. అంగన్​వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపి వారికి ఏ హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అంగన్​వాడీ కార్యకర్తల సమ్మె గత రెండు వారాలుగా జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్​ ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్​వాడీ కార్యకర్తల వేతనాలు రూ.4500 నుంచి 10,500 పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికార పార్టీ రూ.1000 పెంచి సీఎం జగన్​ గొప్పలు చెప్పుతున్నారని ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అంగన్​వాడీ కార్యకర్తల డిమాండ్​లను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details