చదువు, విశ్రాంతి, భోజనాలు తరగతి గదులే సర్వస్వం - గురుకులాల్లో జగనన్న వసతి కష్టాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 2:07 PM IST
Accommodation Difficulties in Tribal Welfare Boys Gurukulam: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడులో (residential school) గిరిజన సంక్షేమ బాలుర గురుకులం అపరిశుభ్రంగా మారింది. విద్యార్థులు భోజనం, తాగు నీరు, వసతిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గురుకులంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు 139 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరి కోసం గురుకులంలో 10 మరుగుదొడ్లు నిర్మించారు.
Authority Restrictions: వాటిని విద్యార్థులు వినియోగించుకోకుండా గురుకులం అధికారులు ఆంక్షలు విధించారు. నాలుగు మరుగుదొడ్లు పై వాడుకలో లేవని రాశారు. మరో ఆరు వినియోగించుకోకుండా వాటిలో అడ్డంగా సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులందరూ మూత్రవిసర్జనలకు ఆరు బయటకు వెళ్తున్నారు. తాగునీటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులే క్యాన్లలో మంచి నీరు తెచ్చుకుంటున్నారు. తరగతి గదుల్లోనే విద్యార్థులు దుస్తులు ఆరేసుకొని, అక్కడే చదువుకుంటూ, అక్కడే నిద్రపోతున్నారు. కొన్ని గదులకు తలుపులు విరిగాయి. కనీసం వీటికి మరమ్మతులు కూడా చేయించలేదు.