ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అరుదైన వ్యాధితో అవస్థపడుతున్న బాలిక

ETV Bharat / videos

Rare disease To Kavya అరుదైన వ్యాధితో అవస్థపడుతున్న బాలిక.. ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి - విశాఖలో జిబి సిండ్రోమ్‌ వ్యాధి వార్తలు

By

Published : Apr 22, 2023, 9:59 PM IST

జిబి సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విశాఖకు చెందిన కావ్య అనే బాలిక చికిత్సకు పట్టా ఫౌండేషన్ తన వంతు ఆర్థిక సహాయం అందజేసింది. విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కావ్యకు 2017లో జిబి సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి సోకింది. అప్పటి నుంచి  కావ్య మంచానికే పరిమితమైంది. ట్యూబుతో ముక్కు ద్వారా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోగలుగుతుంది.

తన కుమార్తె చికిత్సకు లక్షల్లో ఖర్చు కావడంతో తండ్రి హరి కుమార్ రైల్వేలో సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి మధ్యలోనే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. వచ్చిన ఆధాయం కూడా సరిపోక సొంత ఇల్లు కూడా అమ్ముకున్నారు. ప్రస్తుతం చేసేదేమీ లేక ఆపన్న హస్తాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ బాబు వెంటనే స్పందించి తమ వంతు సాయంగా 20 వేల రూపాయలను అందించారు.

వీరితో పాటు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, బాలల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు కావ్య కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మీ నారాయణ తమ వంతు సహాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూడా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details