కోనసీమలో అలరిస్తున్న పొగమంచు అందాలు - కోనసీమ అందాలు
వేసవి సమీపిస్తుండటంతో భానుడు.. తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వేడికి అల్లాడుతుంటే.. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మాత్రం మంచు అందాలు మురిపిస్తున్నాయి. పచ్చని చెట్లు, ఎతైన కొబ్బరి చెట్లను పొగమంచు కప్పేసి.. కనువిందు చేస్తోంది. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఈ మంచు సోయగాలు.. వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Last Updated : Mar 7, 2021, 3:05 PM IST