అదరహో గుర్రపు పందేలు - మునగపాక ఎడ్ల పందేలు న్యూస్
విశాఖ జిల్లా మునగపాకలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన గుర్రపు, ఎడ్ల పందేలు ఆకట్టుకున్నాయి. సంతబయలు యూత్, గ్రామ ప్రజల సహకారంతో.. సీతారామ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సం సందర్బంగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్థులు తరలివచ్చారు.