ప్రతిధ్వని: ధరల పెరుగుదల.. పంటనష్టం! - ప్రతిధ్వని న్యూస్
దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆకు కూరల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. పలు రకాల కూరగాయల తోటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. ఫలితంగా సరఫరా తగ్గి ధరలు అడ్డు, అదుపు లేకుండా పెరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గటంతో ధరలు మండిపోతున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయి రైతులు అల్లాడుతున్నారు. కరోనా సంక్షోభంతో పెరిగిన నిత్యవసర వస్తువులు కొనలేక సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల పంటనష్టంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది.