ఒంగోలు ఎంపీ సీటు దక్కనందునే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ తనపై వస్తున్న వార్తలను వైకాపా నాయకుడువైవీ సుబ్బారెడ్డి ఖండించారు. వ్యక్తిగత కారణాలతోనే విదేశాలకు వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. తాను ఒంగోలు నుంచి టికెట్ ఆశించిన మాట వాస్తవమేనని సుబ్బారెడ్డి వెల్లడించారు. రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ చెప్పారన్నారు. కానీ.. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగడమే ఇష్టమని స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానన్న సుబ్బారెడ్డి.... పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.
అసంతృప్తి ఉంది.. అయినా జగన్ను సీఎం చేస్తా! - ysrcp
తనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వ్యక్తిగత పనులపైనే విదేశాలకు వెళ్లానన్నారు. ఒంగోలు టికెట్ దక్కనందునే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం సరికాదని స్పష్టం చేశారు.
వై.వీ. సుబ్బారెడ్డి
Last Updated : Mar 21, 2019, 7:03 PM IST