రాయచోటిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు - CADAPA
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
ycp
కడప జిల్లా రాయచోటిలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో వైఎస్ఆర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రైతుల సంక్షేమానికి రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారన్న ఆయన....రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు