ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 5, 2023, 5:26 PM IST

Updated : Apr 6, 2023, 6:23 AM IST

ETV Bharat / state

'వైసీపీ ఉన్నన్నాళ్లు మేము ఉంటాం'.. తహశీల్దారుపై వైసీపీ నేతల దౌర్జన్యం

YSP leaders attacked Tehsildar : వైసీపీ నాయకుల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప వాటికి అంతం అనేది లేకుండా పోతోంది.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు.. బెదిరింపులే తాజాగా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో తహశీల్దారుపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు.

YSP leaders attacked Tehsildar
YSP leaders attacked Tehsildar

'వైసీపీ ఉన్నన్నాళ్లు మేము ఉంటాం'.. తహసీల్దారుపై వైసీపీ నేతల దౌర్జన్యం

YSP leaders attacked Tehsildar : వైసీపీ నాయకుల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప వాటికి అంతం అనేది లేకుండా పోతోంది.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు.. బెదిరింపులే తాజాగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్​ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో తహశీల్దారుపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. తహశీల్దార్ కిషోర్​కుమార్​రెడ్డిని స్థానిక నాయకులు కార్యాలయం ముందే బెదిరించారు. అసైన్మెంట్ కమిటీలో తాము చెప్పిన వారికి భూములు కేటాయించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యాలయానికి వచ్చిన వైసీపీ నాయకులు, జడ్పీటీసీ రామ్​గోవింద్​రెడ్డి తహశీల్దార్​తో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో తహశీల్దారు కార్యాలయం.. మరమ్మతుల కోసం విరాళం ఇవ్వాలని వైసీపీ నాయకులను తహశీల్దార్ కోరగా ఆయనను వైసీపీ నాయకులు దారుణంగా ధూషించారు. లంచాలు తీసుకుంటున్న అధికారులకు మళ్లీ విరాళం ఎందుకని ప్రశ్నించారు.

బి కోడూరు మండలంలో చేసినట్లు ఈ మండలంలో చేస్తే కుదరదని వైసీపీ జడ్పీటీసీ రామ్​గోవిందరెడ్డి బ్రహ్మంగారిమఠం తహశీల్దార్ కిషోర్​కుమార్​రెడ్డిని హెచ్చరించారు. సహకార సంఘ కార్యాలయానికి స్థలం లేకుండా ప్రహరీ నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నీ ఆస్తి కాదు నీ ఇల్లు కాదు.. ఈ రోజు ఉంటావు రేపు వెళ్లిపోతావు.. కాని మేము వైసీపీ ఉన్ననాళ్లు ఉంటాం.. అంటూ జడ్పీటీసీ బెదిరింపులకు దిగారు. నువ్వు అధికారం చూపించడానికి ఇది ఏమీ బీ కోడూరు కాదు బ్రహ్మంగారిమఠం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మనోడు కాబట్టి ఉండనీ అనుకుంటున్నాం.. ప్రజలతో మంచిగా ఉండాలంటూ హితబోధ చేశారు. అసైన్‌మెంట్‌ భూముల కేటాయింపునకు తమ వర్గానికి చెందిన వారి పేర్లు నమోదు చేయక పోవడవంతో ప్రహరీ అంశాన్ని నాయకులు సాకుగా చూపి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అందరి ముందు బహిరంగంగా కార్యాలయం ఎదుట తహశీల్దార్​ను బెదిరించడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. రెండు నెలల కిందటే ఈ మండలానికి వచ్చానని ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. జరిగిన ఘటనపై ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు తహశీల్దార్ కిషోర్​కుమార్​రెడ్డి తెలిపారు. తరువాత ఉన్నతాధికారులు ఎలా చెప్తే అలా వారి ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటానని తెలిపారు.

తహశీల్దార్​గా నేను రెండు నెలల క్రితమే వచ్చాను.. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి మాకు అసైన్‌మెంట్‌ కమిటీకి సంబంధించి వెరిఫికేషన్​ ఎక్కువగా ఉంది. నేను నా పని చేసుకుంటుండగా జడ్పీటీసీ రామ్​గోవింద్​రెడ్డి, వారి అనుచరులు అసైన్‌మెంట్‌ వివరాలు తెలుసుకోవాలని వచ్చారు. ఆఫీసు మరమ్మతుల కోసం విరాళం ఇవ్వాలని అడిగాను.. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒకరు మీరు లంచాలు తీసుకుంటున్నారు కదా వాటితో కట్టండి అని అన్నారు. ఇక్కడ ఇంత మంది ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని అన్నందుకు వాళ్లు గొడవ చేశారు. - కిషోర్‌కుమార్ రెడ్డి, తహశీల్దార్‌

ఇవీ చదవండి:

Last Updated : Apr 6, 2023, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details