ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ వివేకా హత్య కేసు: కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్​లను 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ

viveka murder case
viveka murder case

By

Published : Feb 3, 2023, 11:07 AM IST

Updated : Feb 3, 2023, 7:01 PM IST

10:51 February 03

తాడేపల్లి నుంచి కడపకు వెళ్లిన కృష్ణమోహన్ రెడ్డి, నవీన్

సీబీఐ ఎదుట హాజరైన కృష్ణమోహన్ రెడ్డి, నవీన్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఈరోజు సీబీఐ విచారణ ముగిసింది. సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌లను కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో 6.30గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. అవినాష్‌ రెడ్డి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్‌ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణకు ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఫోన్‌ చేశారు? ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారా .. ఇంకెవరికైనా ఫోన్‌ ఇచ్చారా? అనే అంశాలపై సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. నవీన్‌ను మాత్రం సీబీఐ అధికారులు రహస్యంగా విచారించినట్లు సమాచారం.

కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. వారిద్దరూ తాడేపల్లి నుంచి కడపకు వచ్చారు. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ 6.30గంటల పాటు కొనసాగింది. గత నెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినీ హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారించిన సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాల్​ లిస్ట్​ ఆధారంగా సీఎం ఓఎస్డీ కృష్ణ మోహన్, వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకులు నవీన్​కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి :

Last Updated : Feb 3, 2023, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details