ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా పార్టీ ఉదయించే సూర్యుడు.. అరచేయి అడ్డుపెట్టి ఆపలేరు'

YS Sharmila comments on TRS : తెలంగాణలో వైఎస్సార్ పాలన తిరిగి తీసుకురావడం తథ్యమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పునరుద్ఘటించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిసెంబర్ 4 నుంచి 14వరకు పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అదనపు డీజీ జితేందర్‌ను షర్మిల కలిశారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు.

YS Sharmila comments on TRS
YS Sharmila comments on TRS

By

Published : Dec 2, 2022, 9:55 PM IST

YS Sharmila comments on TRS : రాష్ట్రంలో వైఎస్సార్‌ పాలన తిరిగి తీసుకొచ్చే వరకు పోరు ఆగదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 4న నుంచి డిసెంబర్‌ 14 వరకు పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ జితేందర్‌ను కలిసిన షర్మిల పాదయాత్ర నిర్వహించేందుకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను అందించారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తమ పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుంచే ప్రారంభిస్తామని వైఎస్‌ షర్మిల వివరించారు.

YS Sharmila Padayatra in Telangana : "ఆగిన చోట నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తాం. డిసెంబర్‌ 14న పాదయాత్ర ముగుస్తుంది. దాదాపు 4 వేల కి.మీ మేర పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలో 3,525 కి.మీ మేర పాదయాత్ర పూర్తి చేశాను. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులను సాగనంపారు. ప్రస్తుతం స్వార్థపరులే టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ నాయకుల మాటలకు బెదిరిపోను. నా పార్టీని ఆపడం ఎవరితరం కాదు. వైతెపా ఉదయించే సూర్యుడు.. చేయితో ఆపలేరు. వైఎస్‌ఆర్‌ పాలన తిరిగి తీసుకువచ్చే వరకు పోరాడుతాం. కేసీఆర్‌ వైఫల్యాలను ప్రతిరోజు ఎత్తి చూపుతాం." అని వైఎస్ షర్మిల అన్నారు.

ABOUT THE AUTHOR

...view details