ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2020, 1:54 AM IST

ETV Bharat / state

డాక్టర్​గా చూడాలనుకున్నారు... కానీ కడసారి చూడలేకపోయారు

తమ కుమారుడిని డాక్టర్​గా చూడాలన్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. వైద్యునిగా పలువురికి వైద్యం అందించాల్సిన బిడ్డే... బ్రెయిన్​ ఇన్ఫెక్షన్​తో చనిపోవటంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. చివరికి బిడ్డను కడసారైన చూడటానికి వీలులేక పోవటంతో వారి రోదనలు మిన్నంటాయి.ఈ విషాద ఘటన కడప జిల్లా పెనగలూరు మండలంలో జరిగింది.

డాక్టర్​గా చూడాలనుకున్న కొడుకుని... కడసారి చూడలేకపోయారు
డాక్టర్​గా చూడాలనుకున్న కొడుకుని... కడసారి చూడలేకపోయారు

కడప జిల్లా పెనగలూరు మండలంలో బెస్తపల్లికి చెందిన సుబ్బరాయుడు, భారతి దంపతులు ఉపాధి కోసం కువైట్​ వెళ్లారు. తమ కుమారుడు సతీష్​ను ఉక్రెయిన్​లో డాక్టర్ చదివిస్తున్నారు. కొద్ది రోజుల కిందట బ్రైయిన్​ ఇన్ఫెక్షన్​తో సతీశ్​ మృతి చెందినట్లు కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియచేశారు. ఈ విషాద ఘటన తెలుసుకున్న వారు తల్లడిల్లిపోయారు. లాక్​ డౌన్​ కారణంగా భారతి, సుబ్బరాయుడు ఇండియాకు రాలేకపోయారు. ప్రభుత్వం చొరవతో బిడ్డను చూడటానికి తల్లిని మాత్రేమే అనుమతించారు. ఇండియాకు వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ రావటంతో ఐసోలేషన్​కి తరలించారు. తమ బిడ్డ సతీష్​ను చివరిచూపు చూసేందుకు కువైట్ నుంచి వచ్చినా తల్లిని అనుమతించలేదు. చివరికి బంధువుల సమక్షంలో సతీష్ అంత్యక్రియలు పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details