కడప జిల్లా బద్వేలు శ్రీ బీవీఆర్ పీజీ కళాశాలలో అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు ముగిశాయి. ఐదు రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 10 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన 75 విశ్వవిద్యాలయాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఈ క్రీడల్లో పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానంలో నిలువగా, మహారాష్ట్రకు చెందిన సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం, రాష్ట్ర సంత్ తుకడోజి మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను సాధించాయి.
సాఫ్ట్‌బాల్ పోటీల్లో యోగి వేమన విశ్వవిద్యాలయం సత్తా - యోగివేమన విశ్వవిద్యాలయం వార్తలు
బద్వేలులోని బీవీఆర్ పీజీ కళాశాల వేదికగా నిర్వహించిన అంతర్ విశ్వ విద్యాలయాల సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు ముగిశాయి. 75 విశ్వవిద్యాలయాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా.. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం బంగారు పతకాన్ని సాధించింది.
yogi vemana university got first prize in soft ball competitions held in badvel