కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపాకు చెందిన వ్యక్తులు, దాడికి పాల్పడినట్లు ప్రొద్దుటూరులోని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వైకాపా నాయకుడు శివారెడ్డి వెంట తాను తిరగలేదనే కారణంతో, తన అనుచరులతో కలిసి దాడి చేశారంటూ బాధితుడు వాపోయాడు. దాడుల్లో యువకుడికి గాయాలు కావటంతో 3 రోజులుగా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిని సందర్శించటానికి వెళ్లిన ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి బాధితుడిని దాడికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హింసను, దౌర్జన్యాలను సహించేది లేదంటూ ఎమ్మెల్యే తెలిపారు.
'ప్రొద్దుటూరులో యువకుడిపై దాడి... వైకాపా శ్రేణుల పనే అంటున్న బాధితుడు' - ycp attacks
ప్రొద్దుటూరులోని ఓ యువకుడిపై వైకాపా కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గాయాలైన బాధితున్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి ఆసుపత్రి సందర్శించి... దాడికి పాల్పడిన వారి వివరాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు.
'ప్రోద్దుటూరులో దాడికి గురయ్యిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే'