కడప జిల్లా ఎర్రముక్కపల్లిలో విషాదం జరిగింది. కడుపు నొప్పి తాళలేక ధనలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్రముక్కపల్లికి చెందిన శివశంకర్, ధనలక్ష్మికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివశంకర్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొంత కాలం నుంచి ధనలక్ష్మి కడుపునొప్పితో బాధపడుతోంది. పలువురు వైద్యుల వద్ద చూపించినా తగ్గడం లేదు. రాత్రి కడుపు నొప్పి ఎక్కువ కావడంతో ఆ బాధ భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కి తరలించారు.
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కడప జిల్లా ఎర్రముక్కపల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
women suicide in yerramukkapalli kadapa distrcict