ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైశాచిక భర్త.. వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణం - women committed suicide in alamkhan pet

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా అతని వక్రబుద్ధి మారలేదు. వరకట్న వేధింపులు భరించలేక మొదటి భార్య బలవన్మరణానికి పాల్పడగా.. రెండో భార్య వదిలేసి వెళ్లింది. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న మూడో భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లా అలంఖన్ పల్లెలో జరిగింది.

women committed suicide in alamkhan palle
వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణం

By

Published : Apr 27, 2021, 10:16 AM IST

వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా అలంఖన్ పల్లెలో జరిగింది. అలంఖన్ పల్లెకు చెందిన ప్రతాప్​కు కర్నూలు జిల్లాకు చెందిన సావిత్రితో మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి ప్రతాప్ వరకట్నం కోసం సావిత్రిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. వేధింపులు భరించలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని సావిత్రి బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మూడు నెలల కిందటే సావిత్రిని ప్రతాప్​ను మూడో వివాహం చేసుకోగా.. మొదటి భార్య ఇలాగే వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత రెండో భార్య వదిలేసి వెళ్లిపోయింది.

ABOUT THE AUTHOR

...view details