ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలక్ట్రికల్ సంస్థలో.. ప్రమాదవశాత్తు యువతి మృతి - Woman died

కడపలో జిల్లా రామాంజనేయపురంలో ప్రమాదవశాత్తు యంత్రంలో పడి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది.

యువతి మృతి

By

Published : Sep 7, 2019, 10:10 PM IST

యువతి మృతి

కడప జిల్లా రామాంజనేయపురంలోని షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. యంత్రంలో ప్రమాదవశాత్తూ పడిపోయిన 19 ఏళ్ల యువతి.. అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం నుజ్జునుజ్జయింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని గాయత్రిగా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు 18 ఏళ్ల క్రితం నేపాల్ నుంచి వచ్చి కడపలో స్థిరపడ్డారు. రామచంద్రపురంలో ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీలో గత ఎనిమిది మాసాల నుంచి గాయత్రి పనిచేస్తోంది. ప్రమాదవశాత్తు యూనిఫారం క్రషింగ్ యంత్రంలో పడగా.. ఈ విషాదం చోటు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details