ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో పెద్దపులులు.. పట్టించుకునే వారెవ్వరు - కడప జిల్లా బద్వేలు

కడపజిల్లాలోని లంకమల, పెనుశిల అటవీ ప్రాంతాలు జంతు సంచారంతో నిండి ఉంటాయి. కరవు, వేటగాళ్ల ధాటికి ఇవి మనుగడ కోల్పోతున్నాయి. పులులు, ఎలుగుబంట్ల గోర్లు, చర్మం అమ్ముకుంటూ స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు.

చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

By

Published : Feb 9, 2019, 10:14 AM IST

వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నివడం లేదు. వర్షాభావ పరిస్థితులతో ఆహారం, నీరు లేక కొన్ని జంతువులు అంతరించిపోతుంటే... మరికొన్ని స్మగ్లర్ల బారిన పడి నాశనమైపోతున్నాయి.
కడప జిల్లా బద్వేలు చుట్టూ ఆవరించి ఉన్న లంకమల, పెనుశిల అభయారణ్యాలు ప్రపంచ ప్రఖ్యాత ఎర్రచందనం చెట్లకు నెలవు. అక్కడే అరుదైనన కలివికోడి జాడ కనిపిస్తోంది. సుందరమైన ఈ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది.
కొన్నేళ్లగా వర్షాలు పడక అహారం, నీటి కోసం మృగాలు... మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి. దీన్నే వ్యాపారంగా మార్చుకుంటున్నారు వేటగాళ్లు. మూడో కంటికి తెలియకుండా మూగజీవాలను హరిస్తున్నారు. ఎర్రచందనంతోపాటు జంతువుల ప్రాణాలు ఎత్తుకెళ్తున్నారు. చిరుతపులులను వేటాడి మాంసం, గోర్లు, చర్మంతో వ్యాపారం చేస్తున్నారు. ఉచ్చులు వేసి పందులు, జింకలు, కణుతులు పట్టి అమ్ముకుంటున్నారు.
బద్వేలులో పెరుగుతున్న పట్టణీకరణ సైతం మూగప్రాణులకు శాపంగా మారింది. రోడ్డుదాటుతూ దుప్పులు, జింకలు, చిరుతలు తరచుగా నేలకొరుగుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకుని భద్రత పెంచి వన్యప్రాణులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details