ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ఆర్ఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద బైఠాయించి.. ప్లేట్లు పట్టుకుని 'బువ్వ పెట్టండి సార్' అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నారని... సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయడంతో ఎంతోమంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.
'బువ్వ పెట్టండి సార్'.. విద్యార్థుల వినూత్న నిరసన - kadapa
కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు