కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలు మండల ప్రజలు, రైతులు పంట పొలాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎల్లమ్మ రాజు చెరువు నుంచి 30 ఎంసీఎఫ్టీల నీటిని విడుదల చేశారు. 229 ఎంసీఎఫ్టీ సామర్థ్యం గల ఎల్లమ్మ రాజు చెరువులో 60 ఎంసీఎఫ్టీ నిల్వ ఉన్న నీటినుంచి 30ఎంసీఎఫ్టీ నీటిని విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. చిట్వేలి, పెనగలూరు మండలాలకు తాగునీటి సమస్యలు, పొలాలకు నీటి సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కొరముట్ల హామీ ఇచ్చారు. నీటి విడుదల పట్ల గ్రామస్థులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి , పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ రాజు చెరువు నుంచి చిట్వేలు ప్రజలకు నీరు - కడపలో ఎల్లమ్మ రాజు చెరువు వార్తలు
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలు మండల ప్రజలు, రైతులు నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ రాజు చెరువు నుంచి 30 ఎంసీఎఫ్టీల నీటిని విడుదల చేసింది.
water