కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ భాగ్యనగర్ కాలనీలో ఉపరితల జలాశయానికి నీరు నింపాల్సి ఉంది. సోమవారం నీటి సరఫరా విభాగం సిబ్బంది నీటిని సరఫరా చేసి దాన్ని తిరిగి ఆపేయటం మరిచిపోయారు.
ఫలితంగా... ట్యాంక్ నిండిపోయి నీరంతా వృథా అయ్యింది. మున్సిపల్ సిబ్బంది ఏకంగా మూడు గంటల పాటు ఈ విషయాన్ని మర్చిపోయిన కారణంగా ఆ ప్రాంతమంతా నీటి మడుగులా తయారైంది.