ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

viveka murder case: ప్రొద్దుటూరు కోర్టుకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి - వివేకా హత్యకేసులో ప్రొద్దుటూరు కోర్టుకు దస్తగిరి

వైఎస్ వివేకా హత్యకేసులో 86వ రోజు సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని.. సీబీఐ అధికారులు ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లారు.

VIVEKA MURDER CASE TAZA
VIVEKA MURDER CASE TAZA

By

Published : Aug 31, 2021, 11:44 AM IST

Updated : Aug 31, 2021, 1:37 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 86వ రోజు విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని అధికారులు కడప నుంచి ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. 164 సెక్షన్ కింద దస్తగిరి.. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేశారు.

  • నార్కో పరీక్షలపై రేపు విచారణ

మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్​కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్​పై జమ్మలమడుగు కోర్టులో బుధవారం విచారణ జరగనుంది.

  • ఇది వరకే రివార్డు ప్రకటన..

వివేకా హత్య కేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని ఇప్పటికే సీబీఐ ప్రకటించింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని.. హై కోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి:SI BHAVANI SUICIDE CASE: ఈ రోజు చనిపోతున్నా.. ముందుగానే రాసిపెట్టిన మహిళా ఎస్‌ఐ

Last Updated : Aug 31, 2021, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details