కడప జిల్లా కమలాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో వైకాపా నేతల ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేతులమీదుగా లేటపల్లి, పోడదుర్తిలో దాదాపు వెయ్యి కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
కమలాపురం మండలంలో కూరగాయల పంపిణీ
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన విధంగా కూరగాయలు, నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేస్తూ.. అండగా నిలుస్తున్నారు.
కమలాపురం మండలంలో కూరగాయలు పంపిణీ