ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

ప్రపంచమంతా పునరుత్పాదక వనరులు అందుబాటులోకి వస్తున్న సమయంలో యురేనియం ఉపయోగించే అణువిద్యుత్తు ఉత్పత్తి అవసరం లేదని పర్యావరణ వేత్త బాబురావు అన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం వలన నష్టపోయిన రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తున్నారు.

By

Published : Aug 30, 2019, 6:32 AM IST

యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

పచ్చని పంటలను, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ కడప జిల్లాలో తుమ్మలపల్లెలో యురేనియం ఉత్పత్తి జరుగుతుందని పర్యావరణవేత్త బాబురావు ఆరోపించారు. పునరుత్పాదక వనరులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో అణు విద్యుత్తు కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదన్నారు. యురేనియం తవ్వకాలు, ఉత్పత్తి కర్మాగారం వలన తుమ్మలపల్లె చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన యురేనియం కర్మాగారం యాజమాన్యం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతుల తరఫున పోరాడుతున్న పర్యావరణవేత్త, మాజీ శాస్త్రవేత్త బాబూరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details