ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాలం.. ఉపాధి పనులే ఊతం

కరోనా వ్యాప్తి కారణంగా చాలామందికి ఉపాధి లభించక కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఇలాంటి వారికి ఉపాధి హామీ పథకం వరంలా మారింది. గతంలో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసి, ఉద్యోగం కోల్పోయిన పలువురిని ప్రస్తుతం ఈ పనులే ఆదుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులూ సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలామంది తమకు కేటాయించిన పనిదినాలను ఇప్పటికే పూర్తిచేసుకున్నారు.

upadhi haami works in kadapa district
కరోనా కాలం.. ఉపాధి పనులే ఊతం

By

Published : Aug 13, 2020, 9:56 AM IST

2020-21 ఆర్థిక సంవత్సరానికి కడప జిల్లాలో 1,53,66,000 పనిదినాలు కల్పించాలన్నది లక్ష్యం. ఇప్పటికే 1,14,28,273 పనిదినాలు సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పటికే ప్రతిఒక్కరికీ సగటున 47 పనిదినాలు కల్పించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ.364.17 కోట్లు చెల్లించాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే రూ.270.21 కోట్లు అందించారు. ఈ నేపథ్యంలో పనిదినాలను పెంచితే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.

ఎక్కువ మంది 100 రోజులకు చేరువలో..

2018-19 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని మండలాలు కరవు బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించటంతో రెట్టింపు పనిదినాలు కల్పించడానికి అవకాశం ఏర్పడింది. ఫలితంగా ఆ సమయంలో చాలామందికి 100-150 పనిదినాలు కల్పించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 6.5 లక్షల మందికి జాబ్‌ కార్డులు ఉన్నా.. వివిధ కారణాలతో 3,86,525 మంది మాత్రమే ఉపాధి పనులకు వస్తున్నారు. ఇందులో ఇప్పటికే 14,559 కుటుంబాలు 100 రోజుల పనిదినాలను పూర్తిచేసుకున్నాయి. చాలామంది వంద రోజులకు చేరువలో ఉన్నారు. ఈ విషయమై జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులతో మాట్లాడగా ఉపాధి హామీ పథకం ద్వారా రెట్టింపు పనిదినాలు కల్పించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆదేశాలు వస్తే వందరోజులు పూర్తిచేసుకున్నవారికి మళ్లీ పని కల్పిస్తామని చెప్పారు.

రెట్టింపు పనిదినాలు అవసరం

సొంత భూమి కొంత ఉంది. వ్యవసాయం చేసినా పెద్దగా లాభాలు రావట్లేదు. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నా. కరోనా కారణంగా ఈ ఏడాది ఇప్పటికే 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నా. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెట్టింపు పనిదినాలు కల్పించాలని కోరుతున్నా. - రామచంద్ర, ముద్దినేనివాళ్లపల్లి గ్రామం, సంబేపల్లె మండలం

ఇవీ చదవండి..

కాల్వలో దూకిన యువకుడు.. లభించని ఆచూకీ

ABOUT THE AUTHOR

...view details