ఘనంగా 'యోగి వేమన' స్నాతకోత్సవం - convocation
మూడు స్నాతకోత్సవాలు ఒకేసారి ఏర్పాటు చేయడం వలన కడప యోగి వేమన యూనివర్శిటిలో సందడి వాతావరణం నెలకొంది.
కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. 6,7,8 స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించడం వలన సందడి వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథిగా నాక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్పీ శర్మ హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి రామచంద్రారెడ్డి చేతులమీదుగా శర్మ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో యోగి వేమ యూనివర్శిటీ మంచి పేరు సంపాదిస్తుందని శర్శ విశ్వాసం వ్యక్తం చేశారు. 99 మంది పీజీ, డిగ్రీ విద్యార్థులు బంగారు పతకాలు అందుకోగా, 1100 మంది డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.