ఫాతిమా విద్యార్థులకు ప్రభుత్వం అండ - cm chandra babu
బాధిత విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం 13కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. 2018-నీట్లో అర్హత సాధించే వారికి ఫీజుగా చెల్లించనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.
ఫాతిమా కళాశాల బాధిత విద్యార్థులు
కడప జిల్లాలోని ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఫరూక్ వెల్లడించారు. వారి చదువు కోసం 13 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు . కళాశాల యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2015-16 విద్యా సంవత్సరంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఫాతిమా వైద్య కళాశాల అర్హత కోల్పోయిన సంగతి తెలిసిందే.
Last Updated : Feb 16, 2019, 12:09 PM IST