ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీని సీఎం'గా ప్రకటించండి! - పీసీసీ ఉపాధ్యక్షులు

సభల పేరుతో వైకాపా, తెదేపా నేతలు రాష్ట్ర బీసీలను మభ్యపెడుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. నిజంగా ప్రేమే ఉంటే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

బీసీల మీద ప్రేమ ఉంటే సీఎం చేయండి

By

Published : Feb 18, 2019, 5:20 PM IST

బీసీల మీద ప్రేమ ఉంటే సీఎం చేయండి
రాష్ట్రంలో బీసీలను వైకాపా, తెదేపా నేతలు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి విమర్శించారు. నిజంగా ప్రేమే ఉంటే వచ్చే ఎన్నికల్లో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని రెండు పార్టీల నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీకి చెందిన నేతే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. 1970 నుంచే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ అన్నారు. ఈ నెల 21న నిర్వహించే ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్ర పోస్టర్లను కడపలో తులసిరెడ్డి విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details