జగన్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ యువతను మోసం చేశారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా సాకు చూపుతున్న ప్రభుత్వానికి మద్యం దుకాణాల నిర్వహణలో కనబడటం లేదా ? అని ప్రశ్నించారు.