ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TULASIREDDY COMMENTS: 'విశాఖకు రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం' - kadapa district news

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తులసిరెడ్డి తెలిపారు. అమరావతి తరలింపు వల్ల సీమ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు.

tulasi reddy
tulasi reddy

By

Published : Nov 6, 2021, 1:31 PM IST

మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఘీభావం తెలిపినట్లు.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రకటించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కాంగ్రెస్ పార్టీ విధానం.. నినాదమని స్పష్టం చేశారు. దేవతల రాజధాని అమరావతి.. ఆంధ్రుల రాజధాని అమరావతి అని కీర్తించారు. రాజధాని అంటే రాష్ట్ర సచివాలయమని.. శరీరానికి గుండె ఎలాంటిదో రాష్ట్రానికి సచివాలయం అలాంటిదని అన్నారు.

దేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక రాజధాని మాత్రమే ఉందని తులసిరెడ్డి అన్నారు. సచివాలయాన్ని విశాఖ తరలించాలన్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదమని అభిప్రాయపడ్డారు. విశాఖకు రాజధాని తరలింపు రాయలసీమవాసులకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇకనైనా రాజధాని తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హితవుపలికారు.

ABOUT THE AUTHOR

...view details