ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంధ్రప్రదేశ్​ను ఆంగ్లప్రదేశ్​ చేస్తారా...?' - తెలుగు భాషపై తులసి రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తప్పుబట్టారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్​ను ఆంగ్లప్రదేశ్​గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

తెలుగు భాషపై తులసి రెడ్డి

By

Published : Oct 26, 2019, 4:10 PM IST

'ఆంధ్రప్రదేశ్​ను ఆంగ్లప్రదేశ్​ చేస్తారా...?'

వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం చారిత్రక తప్పిదమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన సమయంలో... దానిని మృతభాషగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కడపలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్​ను ఆంగ్లప్రదేశ్​గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తెలుగు సాహితీ వేత్తలు, భాషాభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details