ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీది జీఎస్​టీ... జగన్​ది జేఎస్​టీ: తులసిరెడ్డి - మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శలు

రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవటంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం మద్య నిషేదం అంటూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తోందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం దుకాణాలను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు.

tulasi reddy
tulasi reddy

By

Published : May 4, 2020, 5:19 PM IST

మీడియాతో తులసిరెడ్డి

కమీషన్ల కోసమే రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మద్య నిషేధం చేయాలని అన్నారు. అంతేకానీ ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ధరలు పెంచడం వలన మద్యపాన నిషేధం జరుగుతుందని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని తులసి రెడ్డి అన్నారు.

మోదీ జీఎస్​టీ అంటే జగన్మోహన్ రెడ్డి జేఎస్​టీ (జగన్ సర్వీస్ టాక్స్) అంటున్నారని విమర్శించారు. కరోనా ఆర్థిక సహాయం పేరిట పేదలకు పంచింది 1400 కోట్లు రూపాయలు అయితే... ఏజేఎస్​టీ వల్ల 4500 కోట్లు తాగుబోతుల కుటుంబాల నుంచి గుంజుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details