కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవ నిర్వహణ కోసం రూ. 17 కోట్లతో నిర్మించిన కళ్యాణ వేదికను తితిదే ఈవో జవహర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన...కోదండ రామస్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించడానికి కళ్యాణ వేదిక నిర్మించినట్లు చెప్పారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది స్వామివారి కళ్యాణం ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించామన్నారు. వచ్చే ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా నూతన వేదికపై స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించిన తితిదే ఈవో - తితిదే ఈవో న్యూస్
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారిని తితిదే ఈవో జవహర్‌రెడ్డి సందర్శించారు. స్వామివారి కళ్యాణం నాటికి స్వామివారి దయతో కొవిడ్ పూర్తిగా నశించిపోగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, ఒంటిమిట్ట డిప్యూటీ ఈవో శ్రీలోకనాథం తదితరలున్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించిన తితిదే ఈవో
TAGGED:
తితిదే ఈవో న్యూస్