ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా తరఫున ప్రచారంలో ట్రాన్స్ జెండర్స్

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ట్రాన్స్ జెండర్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు.  త‌మ‌కు స‌మాజంలో గుర్తింపు ఇచ్చి..  అన్ని విష‌యాల్లో ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు... మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని కాంక్షించారు.

తెదేపా తరఫున ప్రచారంలో ట్రాన్స్ జెండర్స్

By

Published : Apr 7, 2019, 10:31 AM IST

తెదేపా తరఫున ప్రచారంలో ట్రాన్స్ జెండర్స్

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా తరఫున ట్రాన్స్ జెండర్స్ ప్రచారంలోకి దిగారు. తెదేపా ప్రభుత్వం తమను థర్డ్ జెండర్స్​గా గుర్తిస్తూ.. ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పింఛన్లు అందజేసిందని ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. పార్టీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమనీ.. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ వీఎస్ ముక్తియార్ వారితో ప్రచారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details