ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోశాలకు మూగజీవాల తరలింపు

జమ్మలమడుగులో రోడ్డుపై మూగజీవాలు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు మునిసిపల్ సిబ్బంది దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పశువుల యాజమానులకు జరిమానా విధించినట్లు తెలిపారు. డివైడర్లపై తిరుగుతున్న కొన్నింటిని జేసీబీ సాయంతో గోశాలకు తరలిస్తున్నారు.

రోడ్లపై ఉన్న మూగజీవాలను గోశాలకు తరలింపు
రోడ్లపై ఉన్న మూగజీవాలను గోశాలకు తరలింపు

By

Published : Nov 17, 2020, 6:33 PM IST

నిత్యం వాహనాలతో, చిరు వ్యాపారులతో రద్దీగా ఉండే కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఆవులు, ఎద్దులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటిని యాజమానులు వదిలేయటంతో ఇష్టం వచ్చినట్లు రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు శానిటరీ పర్యవేక్షకులునూర్ బాషా తెలిపారు.

తాడిపత్రి, ప్రొద్దుటూరు రోడ్డు, డివైడర్​లపై తిరుగుతున్న మూగజీవాలను పట్టుకున్నామన్నారు. రెండు వారాలుగా దాదాపు 46ఆవులను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు యజమానులకు సమాచారం అందచేశామని చెప్పారు. 22 మంది అపరాధ రుసుం చెల్లించి తీసుకెళ్లారని తెలిపారు. 23 ఆవులను జేసీబీ సహాయంతో లారీలో ఎక్కించి, మైలవరం మండలంలోని అగస్త్యేశ్వర కోన సమీపంలో ఉన్న గోశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details