కేశలింగాయపల్లి వద్ద ఢీకొని రెండు ట్రాక్టర్లు బోల్తా - tracctor accident
కడప జిల్లాలో రెండు ట్రాక్టర్లు ఢీకొన్నాయి. మైదుకూరు నుంచి వనిపెంట వైపునకు వెళ్తున్న చెత్త ట్రాక్టర్ను వెనకనే వస్తున్న మరో ఎరువు ట్రాక్టర్ తప్పించే క్రమంలో ఢీకొట్టింది.
రెండు ట్రాక్టర్లు ఢీ..బోల్తా
కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లి వద్ద 2 ట్రాక్టర్లు ఢీకొన్నాయి. మైదుకూరు నుంచి వనిపెంట వైపునకు వెళ్తున్న చెత్త ట్రాక్టర్ను వెనకనే వస్తున్న మరో ఎరువు ట్రాక్టర్ తప్పించే క్రమంలో ఢీకొట్టింది. ఈ క్రమంలో రెండు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదమేమీ జరగలేదు. రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండీ:గోదావరి డెల్టాకు సీలేరు నీరు...!